Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 16, శ్లోకం 10
10.
కామమాశ్రీత్య దుష్పూరం
దంభమానమదానవ్వితా : |
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్‌
ప్రవర్తంతే శుచివ్రతా: ||

తాత్పర్యము : పూరింపశక్యము కానటువంటి కామము నాశ్రయించి గర్వము మరియు మిథ్యాహంకారములను కూడినవారై భ్రాంతి నొందినటువంటి అసురస్వభావులు అశాశ్వతములైనవాని యెడ ఆకర్షితులై సదా అపవిత్ర వ్రతులగుదురు.

భాష్యము : అమితముగా ఆనందించాలనే కోరికల వలన దానవులు తాత్కాలికమైన వాటిని నమ్మి కలతలను కొని తెచ్చుకుందురు. అయితే వారు తప్పు ద్రోవ పట్టుచున్నామని గుర్తించలేరు. తమంతట తామే ఒక దేవుణ్ని, మంత్రాలను సృష్టించెదరు. వీటన్నింటి వలన మరింతగా మత్తుమందు, మగువ, జూదము, మాసంభక్షణలో మునిగిపోవుదురు. వీటన్నింటినీ శాస్త్రములు అనుమతించవు. వారు ‘అసుచివ్రతులు’ అనగా పరిశుద్ధత లేని వారుగా సంభోధింపబడిరి. ఈ ప్రపంచమున అట్టి వారు సామాన్యులచే గౌరవింపబడుటచే వారు ఎంతో ఉన్నతులమని భావించుటచే నరకమునకు వెళ్ళబోవు చున్నామని గుర్తించరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement