Friday, April 26, 2024

వీడియో: హెల్మెట్‌ను పుచ్చకాయలా నోట్లోకి లాగేసిన ఏనుగు..

పాపం ఆ ఏనుగుకు ఆక‌లేసిన‌ట్లుంది..ఆ ప్రాంతంలో ఎలాంటి ఆహార ప‌దార్థాలు కనిపించ‌లేదు. దీంతో అక్క‌డున్న ఓ హెల్మెట్‌ను తొండంతో తీసుకుని, నోట్లోకి లాగేసుకుంది. ఈ ఘ‌ట‌న అసోం గువహాటిలోని స‌త్గావ్ ఆర్మీ క్యాంపు వ‌ద్ద వెలుగు చూసింది. నోట్లో హెల్మెట్ పెట్టుకున్న ఏనుగు అక్క‌డ్నుంచి మెల్ల‌గా వెళ్లిపోయింది. ఈ దృశ్యాల‌ను హెల్మెట్ య‌జ‌మాని త‌న సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశాడు. త‌న హెల్మెట్‌ను ఏనుగు లాగేసుకుంది.. తాను ఎలా వెళ్లాలి అని అత‌ను వాపోయాడు.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement