Friday, April 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 12, శ్లోకం 11

11.
అథైతదప్యశక్తోసి
కర్తుం మద్యోగమాశ్రిత: |
సర్వకర్మఫలత్యాగం
తత: కురు యతాత్మవాన్‌ ||

తాత్పర్యము : అయినను ఒకవేళ నా భావనలో కర్మను చేయుట యందును నీవు అసమర్థుడవైనచో సర్వకర్మఫలములను త్యాగము చేసి ఆత్మస్థితుడవగుటకు యత్నింపుము.

భాష్యము : ఏదో ఒక కారణము చేత కృష్ణచైతన్య కార్యములలో పాల్గొనలేక పోయినట్లయితే కనీసము ఒక మంచి కార్యము కొరకు తమకున్నదానిని దానము చేయవచ్చును. దీనివలన జ్ఞానము లభించి కృష్ణున్ని అర్థము చేసుకునే స్థితికి ఎదుగవచ్చును. వేదాలలో అనేక పుణ్య కార్యాలు తెలియజేయబడినవి. పూర్వపు పుణ్యము వలన లభించిన దానిని అటువంటి కార్యములకు దానము చేయవచ్చును. అలాంటి త్యాగ గుణము మనస్సును పవిత్రీకరిస్తుంది. పవిత్రీకరింపబడిన మనస్సు వలన భగవంతుణ్ని అర్థము చేసుకొనుటకు సాధ్యమవుతుంది. భగవద్భక్తి త్యాగాలు, దానాలపైన ఆధారపడనప్పటికీ, భగవద్ధక్తి చేయలేనివారికి అవి దోహదము చేస్తాయి. అందువలన సామాజిక సేవ, దేశసేవ, మానవ సేవ ఏదో ఒక రోజు భగవద్భక్తిని స్వీకరించేందుకు అవకాశాన్నిస్తాయి. త్యాగభావన వలన కృష్ణుడే దేవాదిదేవుడనీ, అతని కోసము అన్ని త్యాగాలు చేయవలసి ఉంటుందనే జ్ఞానమును ఉద్ధరించబడతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …

Advertisement

తాజా వార్తలు

Advertisement