Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 42,43
42
యామిమాం పుష్పితాం వాచనం
ప్రవదంత్యవిపశ్చిత: |
వేదవాదరతా: పార్థ
నాన్యదస్తీతి వాదిన: ||

43
కామాత్మాన: స్వర్గపరా
జన్మకర్మఫలప్రదామ్‌ |
క్రియావిశేషబహులాం
భోగైశ్వర్యగతిం ప్రతి ||

42–43 తాత్పర్యము : స్వర్గలోకప్రాప్తి, ఉత్తమ జన్మము, అధికారము వంటివానిని పొందుటకై వివిధములైన కర్మలను ఉపదేశించు వేదములందలి మధురమైన వాక్కులయెడ అల్పజ్ఞలు అనురక్తులగుదురు. భోగానుభవమును మరియు సంపన్న జీవితమును కోరువారగుటచే అట్టివారు దానికి మించినది వేరొకటి లేదని పలుకుదురు.

భాష్యము : సామాన్య ప్రజానీకము అంత తెలివితేటలను కలిగి ఉండకపోవుటచే వేదాలలోని కర్మకాండలో వివరించే స్వర్గ భోగాలకు ఆశపడి ఇంతకం టే ఏమీ అవసరము లేదని, మం దు, మగువ, భోగాలను అనుభవించుట కొరకు ఆడంబరమైన యజ్ఞాలను నిర్వహించుచుందురు. వేదాల లక్ష్యము ఇదేనని భావించి మోసపోవుదురు. అటువంటి వారికి మనస్సును కృష్ణచైతన్యముపై నిలుపుట సాధ్యము కానిపని. సరైన అవగాహన లేని కారణమున, భౌతిక బంధనాల నుండి ముక్తి పొందుటను లక్ష్యపెట్టరు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement