Wednesday, May 8, 2024

తెలంగాణ‌లో మ‌త‌విధ్వేషాల‌కు తావు లేదు

భార‌త దేశం లౌకిక వాదం, భిన్న‌త్వంలో ఏక‌త్వం క‌లిగిన దేశ‌మ‌ని తొర్రుర్ డీఎస్పీ వెంక‌ట‌ర‌మ‌ణ రెడ్డి అన్నారు. మహబుబాబాద్ జిల్లా మ‌రిపెడ పీఎస్ పరిధిలో నిర్వ‌హించిన శాంతి స‌మావేశానికి ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. తెలంగాణ ఎప్ప‌టికి మ‌త‌ప‌ర‌మైన విభేదాలు రావ‌ని అన్నారు. ఎన్నో ఏళ్లుగా అన్న‌ద‌మ్ముల్లా అన్ని మ‌తాల వారు క‌లిసి మెలిసి ఉంటున్నామ‌న్నారు. తెలంగాణ‌లో ప్ర‌జ‌లంతా కుల‌మ‌త బేధాలు లేకుండా ఒకే స‌మాజానికి చెందిన కుటుంబంలా క‌లిసి ఉన్నార‌ని తెలిపారు.

రాష్ట ప్ర‌భుత్వం సైతం అన్ని మ‌తాల సంక్షేమానికి పెద్ద‌పీఠ వేస్తూ అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టింద‌న్నారు. ద‌స‌రాకు చీరెలు, రంజాన్‌కు తోఫాలు, క్రిస్మ‌స్‌కు గిఫ్ట్‌లు అంద‌జేస్తున్న అంద‌రిని స‌మాన‌త్వంతో తెలంగాణ ప్ర‌భుత్వం చూస్తోంద‌న్నారు. రంజాన్ ముస్లింల‌కు అత్యంత ప‌విత్రమైన మాసం భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో 30రోజులు ఉప‌వాస‌దీక్ష‌లు చేసి చివ‌రి రోజుల ఈద్ సంతోషంగా జ‌రుపుకోవాల‌న్నారు. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వాటిని ఏ మ‌తం వారు కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఒక్క‌టిగా క‌లిసి ఉండాల‌న్నారు.

అనంత‌రం మ‌రిపెడ ఎస్ఐ ప్ర‌వీణ్‌కుమార్ మాట్లాడుతూ.. మ‌రిపెడ‌లో గ‌డ‌చిన 20ఏళ్లుగా మ‌త విద్వేశాల‌కు సంబంధించి ఎలాంటి ఘ‌ర్ష‌న‌లు జ‌రుగ‌లేద‌ని, ఇక‌మీద‌ట కూడా జ‌ర‌గ‌వ‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌లంతా ఏక తాటిపై క‌లిసి మెలిసి అన్ని పండుగ‌లు, ఉత్స‌వాలు జ‌రుపుకుంటున్నార‌న్నారు. సోష‌ల్ మీడియాలో రెచ్చ‌గొట్టె వాఖ్య‌లు చేసినా త‌మ దృష్టికి తీసుకురావాల‌ని కోరారు. వ‌దంతులు, అస‌త్య ప్ర‌చారాలు చేసే వారిని న‌మ్మొద్ద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement