Tuesday, May 7, 2024

ఈశ్వరుడే సాక్షి!

‘అంతా ఈశ్వరేచ్ఛ’ అంటుం టాం. అంటే.. కర్మకు ఫలితం నిర్దే శించిన వాడు ఈశ్వరుడు. ఆయన నిర్దేశించిన ఫలితం మనంచేసినకర్మ లకు వస్తుంది. అది ఈశ్వరేచ్ఛ. ఎవరు ఏ కర్మ చేస్తేవారికి ఆ ఫలితం వస్తుంది. ఆయన ఎవరి యందూ ప్రత్యేకదృష్టి కలిగి ఉండ డు. ఆయన సాక్షి. కాబట్టే ఈ కర్మలు నమోదై, ఆయా కర్తవ్యపాల నానికి ఆయా ఫలితాలు పొందు తున్నాం. ఎప్పుడూ కూడా ప్రతి మనిషికీ ఒక సంఘటనలో హద్దు ఉంటు-ంది. భక్తుడే కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగికావచ్చు. అంతస్థు, పరిధిని అతిక్రమించకూడదు. శ్రీరాముడు మానవుడుగా వచ్చాడు. మానవుడుగా జీవించాడు.
యుద్ధంలో రావణుని ఎదిరించి, సంహరించాడు. స్వయంగా ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువువే అని చెప్పినా ఆంతర స్థితిలో ఏమున్నా… లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుష్యుడుగానే ఉన్నాడు.. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిధి దాటలేదు. అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిధేమిటో తెలియ వచ్చేలా చేసాడు. భీష్ముడుదైవీశక్తులు కలవాడు. దైవాంశ సంభూతుడు. కురుక్షేత్రంలో ఒళ్ళుమరచి పాండవ సేనను చీల్చి చెండాడుతూ, అర్జు నుని మీద కూడా తన దైవీశక్తులను ప్రకటించి యుద్ధం చేసాడు. భీష్ము డు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్థుని, పరిధినిమించి దైవీశక్తులను ప్రక టిస్తున్నాడు కనుక ఆయుధంపట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు. భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణునిదండన స్వీకరించ డానికి సిద్ధపడ్డాడు. సంపూర్ణ అవతారమైనా ధర్మం విషయంలో మనుష్యులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిధిని మీరలేదు.
గీతలో నీ కర్తవ్యం యుద్ధం చేయడం. యుద్ధం చెయ్యి, గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గం అన్నాడు తప్ప.. ఏం జరిగినా నేను న్నాను అని చెప్పలేదు. నువ్వు చేయవలసింది చేయి అన్నాడు. ధర్మం పాటించమన్నాడు. ఈ కర్మకు ఈ ఫలితం అని నిర్దేశిం చాడు. కాల స్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు. నువ్వు యుద్ధం చేయబోతున్నావు. మీరు యుద్ధం గెలవబోతున్నారు. వారు చనిపోబోతున్నారు. అని చూపించా డు తప్ప, ‘నేను మీకిచ్చేస్తున్నాను’ అని చెప్పలేదు అలా అయితే కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయ వచ్చు. అలా చేయలేదు. అంటే… మనం చేసే కర్మలకు ఫలితం మనకు వస్తుంది. అదే ఈశ్వరేచ్ఛ.

Advertisement

తాజా వార్తలు

Advertisement