Monday, April 29, 2024

ఆత్మ గౌరవము (ఆడియోతో…)

ఆత్మ గౌరవానికి పునాది భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విశ్వాసము. ఈ భావము నిన్ను నీవు ప్రేమించుకునేలా చేస్తుంది. భగవంతుడిలోని సుగుణాలను అధ్యయనం చేసి వాటిని నీ నిత్యజీవితంలో గ్రహించినప్పుడు నీలోని సమర్థతపై నీకు విశ్వాసం పెరుగుతుంది.

ఒక్కోసారి ఆత్మ గౌరవంతో ఉండటం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఆత్మ గౌరవాన్ని స్తుది, సంపద, హోదా వంటి వాటి మీద నిలబెట్టాము కాబట్టి. ఇవి కదిలినప్పుడు ఆత్మ సంతృప్తి కూడా కదులుతుంది. ఒకరోజు నీ అంత మంచివాడు లేనేలేడు అని భావిస్తావు, మరో రోజు నీ అంతటి వాడు లేడు అనీ భావిస్తావు. నిజానికి, మనం జీవితంలో ఏమి చేస్తున్నాము అన్నది అత్మ గౌరవము కాదు, ప్రతి కర్మలో ఎంతగా సుగుణాలను, సమర్థతలను తీసుకువస్తున్నాము అనేదే నిజమైన ఆత్మ గౌరవము.

–బ్రహ్మాకుమారీస్‌.
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement