Wednesday, May 15, 2024

అన్నమయ్య కీర్తనలు : వాడెవో ప్రహ్మాద వరదుడు

వాడెవో ప్రహ్మాద వరదుడు
వాడెవో భక్తవత్సలుడు || వాడెవో ప్రహ్మాద వరదుడు ||

కోరదవడలతోడ కోటి సూర్య తేజముతో
హార కేయూరాది భూషణాంబరాలతో
చేరి బ్రహ్మాదు లెల్లాను సేవలు సేయగాను
మేర మీరిన సిరుల మేడలో నున్నాడు || వాడెవో ప్రహ్మాద వరదుడు ||

తెల్లనిమేనితోడ తీగెనవ్వుల తోడ
చల్లని గంధముల వాసనలతోడ
పెల్లుగా నారదాదులు పేరుకొని నుతించగా
వెల్లవిరి కొలువై వేడుకనున్నాడు || వాడెవో ప్రహ్మాద వరదుడు ||

సంకుచక్రముల తోడ జంట పూదండలతోడ
పొంకపు నానా విధ భోగములతో
అంకపు శ్రీ వేంకటాద్రి నహోబలమునందు
అంకెల నేపొద్దూ నెలవై తానున్నాడు || వాడెవో ప్రహ్మాద వరదుడు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement