Tuesday, April 30, 2024

అన్నమయ్య కీర్తనలు : పసిడి యక్షింతలివె

పసిడి యక్షింతలివె పట్టరో వేగమె రారో
దెసల పేరంటాండ్లు దేవుని పెండ్లికిని || ||పసిడి యక్షింతలివె||

శ్రీవేంకటేశ్వరునికి శ్రీమహాలక్ష్మికి
దైవికపు పెండ్లి ముహూర్తము నేడు
కావించి భేరులు మ్రోసె గరుడధ్వజంబెక్కె
దేవతలు రారో దేవుని పెండ్లికిని || ||పసిడి యక్షింతలివె||

కందర్ప జనకునికి కమలాదేవికి పెండ్లి –
పందిలిలోపల తల బాలు నేడు
గంధమూ విడెమిచ్చేరు కలువడాలు గట్టిరి
అందుక మునులు రారో హరిపెండ్లికిని || ||పసిడి యక్షింతలివె||

Advertisement

తాజా వార్తలు

Advertisement