Wednesday, April 17, 2024

ఫుల్ స్పీడ్ లో గజిని!!

ఆకాశం నీ హద్దురా సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు హీరో సూర్య. వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు. తన కెరీర్లో 39 వ సినిమా అయినా కుత్తటిల్ ఒరుధన్ జ్ఞానవెల్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో కర్ణన్ హీరోయిన్ రిజిషా విజయన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో లాయర్ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గిరిజనుల సమస్యలపై పోరాడే ఒక పవర్ ఫుల్ లాయర్ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. మొదటి సారి ఈ సినిమాలో సూర్య నల్ల కోటు ధరించబోతున్నాడు.

అందుకే ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాను సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య 40 వ సినిమా చేస్తున్నారు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందే ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివసల్ అనే సినిమాలో నటిస్తున్నాడు సూర్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement