Wednesday, May 8, 2024

నవంబర్‌ 11న థియేటర్లలో యశోద.. అనౌన్స్​ చేసిన చిత్ర నిర్మాతలు

తాజాగా సంబంత నటిస్తోంన్న లేడీ ఓరి యంటెడ్‌ మూవీ యశోద. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. హరి మరియు హరీష్‌ దర్శకులు. నవంబర్‌ 11న తెలుగు సహా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత వెల్లడించారు. విడుదల తేదీ పోస్టర్‌ ని వినూత్నంగా అభిమానులు ద్వారా విడుదల చేసారు. చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ ”ఇదొక న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌. ఇందులో హ్యుమన్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి. మహిళా ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి.

వినూత్నమైన కథతో రూపొందిన సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ యశోద. టైటిల్‌ పాత్రలో సమంత అద్భుతంగా నటించారు. యాక్షన్‌ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని చేశారు.. తెలుగు, తమిళ భాషల్లో ఆమె స్వయంగా డబ్బింగ్‌ చెప్పారు. మణిశర్మ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఎక్కడా రాజీ పడకుండా వంద రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశాం. నవంబర్‌ 11 న విడుదల చేస్తాం” అని చెప్పారు. ఈ చిత్రంలో సమంత, వరలక్ష్మీ, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళీ శర్మ, సంపత్‌ రాజ్‌, మధురిమ, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement