Tuesday, April 30, 2024

జిమ్ లో వ‌ర్క్ వుట్స్.. వీడియో పోస్ట్ చేసిన న‌మ్ర‌త‌

జిమ్ లో వ‌ర్క్ వుట్స్ చేస్తున్న వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. వ్యాయామం న‌మ్ర‌త దినచర్యలో భాగంగా ఉంటుంది. 51 ఏళ్ల నమ్రత కఠిన నియమాలు పాటించి యంగ్ లుక్ మైంటైన్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ జిమ్ వీడియో షేర్ చేశారు. సదరు వీడియోలో జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో నమ్రత కసరత్తులు చేస్తున్నారు. గతంలో నమ్రత చేయని పుల్ అప్స్, స్విస్ బాల్ ప్లాంక్, రోల్ అవుట్ ఎక్సర్సైజులు ఆమె చేశారట. ట్రైనర్ కుమార్ మన్నవ ఆమెకు సహనంగా శిక్షణ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. నమ్రత సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. అదే సమయంలో నమ్రత బ్యూటీ సీక్రెట్ ఇదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మహేష్-నమ్రత టాలీవుడ్ క్రేజీ కపుల్ గా ఉన్నారు. భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement