Sunday, May 5, 2024

షానిద్ అసిఫ్ ఆలీతో – న‌టి పూర్ణ ఎంగేజ్మెంట్

హీరోయిన్ పూర్ణ పెళ్లికి రెడి అయింది..ఈమె వ‌య‌సు 32సంవ‌త్స‌రాలు. కుటుంబ సభ్యుల దీవెనలతో జీవితంలో తదుపరి అంకంలోకి ప్రవేశించాను. షానిద్ అసిఫ్ అలీ తో ఎంగేజ్మెంట్ జరిగింది, అని పూర్ణ కామెంట్ పెట్టారు. రింగ్ ఎమోజీ పోస్ట్ చేయడంతో వారికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది . ఇంతకీ ఎవరీ అసిఫ్ అలీ అని ఆరా తీయగా.. ఈయన ఓ బిజినెస్ మాన్. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ మరియు సీఈఓ. కోట్ల రూపాయల ఆస్తులకు అధిపతి అని తెలుస్తుంది. ఇక ఇది కుటుంబ సభ్యులు నిర్ణయించిన వివాహమా? లేక ప్రేమ వివాహమా? అనేది తెలియాల్సి ఉంది.ఇక పూర్ణ కాబోయేవాడిని పరిచయం చేయడంతో అభిమానులు, సన్నిహితులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. వారి జంట ముచ్చటగా ఉందని కితాబు ఇస్తున్నారు. ప్రస్తుతం పూర్ణ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement