Wednesday, May 15, 2024

అలీతో పవన్ ఒప్పుకుంటాడా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో పాటు సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. వీటితోపాటు మరికొన్ని సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ లైన్ లో పెట్టారు. అందులో గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు హరీష్ శంకర్.

ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబందించిన ఓ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అలీ కూడా నటించబోతున్నాడట. అయితే గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ లో అలీ ఎలాంటి రోల్ పోషించాడో ఈ సినిమాలో కూడా అలానే ఫుల్ లెంత్ పాత్ర ఉంటుందట. అయితే గతంలో రాజకీయాల నేపథ్యంలో పవన్ అలీలు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరు మళ్ళీ సినిమా కలిసి చేస్తున్నారని వార్తలు రావడంతో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement