Sunday, April 28, 2024

Whispers: బాలీవుడ్ లో గుస‌గుస‌లు..

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ న‌ట‌వార‌సుడు ఆర్యన్ ఖాన్ టాలీవుడ్ హీరో సాయిధ‌ర‌మ్ హీరోయిన్ తో ప్రేమ‌లో ఉన్నాడ‌నేది తాజా గుసగుస‌.. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడిగా స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్న ఖాన్ వార‌సుడు ఆర్య‌న్ ఖాన్ డేటింగ్ పుకార్లు ఇంటర్నెట్‌ను బ్రేక్ చేస్తున్నాయి.

తాజా క‌థ‌నాల‌ ప్రకారం .. అతడు ప్ర‌ముఖ‌ బ్రెజిలియన్ మోడల్ కం నటి లారిస్సా బోనెసితో సంబంధంలో ఉన్నాడు. షారుఖ్ ఖాన్- ఆర్యన్ ఖాన్ సోదరి సుహానా ఖాన్ నటించిన ఆర్యన్ ఖాన్ సొంత‌ దుస్తుల బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ కోసం కూడా లారిస్సా నటించింది. అయితే ఈ యంగ్ పెయిర్ తమ రిలేషన్ షిప్ గురించి వస్తున్న రూమర్స్ పై ఇంకా స్పందించలేదు. ప్ర‌స్తుతానికి ఆర్యన్ సోదరి సుహానా కూడా లారిస్సాకు స‌న్నిహితంగా మెలుగుతోంది. సోష‌ల్ మీడియాల్లో ఒకరినొకరు అనుసరించేంత‌గా వారి మ‌ధ్య‌ బంధం ఏర్పడింది.

- Advertisement -

లారిస్సా బోనేసి ఎవ‌రు? అంటే.. బ్రెజిల్‌కు చెందిన మోడల్ కం నటి. మార్చి 1990లో జన్మించింది. 12 సంవత్సరాల వయస్సులో మోడలింగ్‌ను ప్రారంభించింది. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశానికి మకాం మార్చింది. ఇక్క‌డ మోడ‌ల్ కం న‌టిగా రాణిస్తోంది. ఇప్ప‌టికే హిందీ- తెలుగు- పంజాబీ స‌హా బహుభాషా పరిశ్రమలలో ప‌ని చేస్తోంది. లారిస్సా టాలీవుడ్ కి సుప‌రిచితురాలు. ఈ భామ మెగా హీరో సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న తిక్క మూవీలో నటించింది. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో సాయిధ‌ర‌మ్ త‌న‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు. ఇదే విష‌య‌మై ఓ ఇంట‌ర్వ్యూలో సాయిధ‌రమ్ బ‌హిరంగంగానే మాట్లాడాడు. లారిస్సాను ప్రేమించాను.. ప్ర‌పోజ్ చేసాను.. కానీ తిర‌స్క‌రించింది అని సాయిధ‌ర‌మ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement