Sunday, April 28, 2024

AP – ఇంటి వ‌ద్దే పెన్ష‌న్ లు ఇచ్చేందుకు ఇబ్బంది ఏంటీ …ప‌వ‌న్ క‌ల్యాణ్

అమ‌రావ‌తి – ఏపీలో ఇవాళ్టి నుంచి పెన్షన్లు అందిస్తుండగా, సచివాలయాలకు వృద్ధులను మంచాలపై మోసుకువస్తున్న ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ చీఫ్ సెక్రటరీ గారూ… వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్లు అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి? అని సూటిగా ప్రశ్నించారు.
“పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల వద్ద రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు. తహసీల్దార్ నెంబర్లు ఇస్తారు. మరి అదే ఉద్యోగులను పెన్షన్లు ఇవ్వడానికి వినియోగించుకోలేరా? పెన్షన్లు ఇవ్వడానికి ఉద్యోగులే లేరా? కరోనా కాలంలో మద్యం షాపుల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసి ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లను ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు. వైసీపీ నాయకులు చేసే మెలో డ్రామాలకు, బ్లేమ్ గేమ్స్ కు ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి” అని పవన్ ట్వీట్ చేశారు. అంతేకాదు, భీమ్లానాయక్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్ల వద్ద ఉద్యోగులను నియమిస్తూ వెలువడిన ఉత్తర్వుల ప్రతిని కూడా పవన్ కల్యాణ్ పంచుకున్నారు.

ఆరోగ్యం కుదుట‌ప‌డిన త‌ర్వాత తెనాలి వ‌స్తా ..

జనసేనాని పవన్ కల్యాణ్ అస్వస్థతతో బాధపడుతూనే నిన్న పిఠాపురం నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో ఇంటింటికీ తిరిగారు. దాంతో, ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో చికిత్స కోసం పిఠాపురం నుంచి హైదరాబాద్ వ‌చ్చేశారు. వాస్తవానికి పవన్ ఇవాళ తెనాలిలో వారాహి విజయభేరి సభలో పాల్గొనాల్సి ఉంది. ఆయన హైదరాబాద్ వెళ్లిపోవడంతో ఈ సభ వాయిదా పడింది.
పవన్ ఆరోగ్యం పట్ల అభిమానుల్లోనూ, జనసేన పార్టీ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అస్వస్థతకు గురికావడం వల్ల తెనాలిలో నిర్వహించవలసిన వారాహి యాత్ర, సభను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత తెనాలి విచ్చేసి, వారాహి సభలో పాల్గొంటానని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement