Tuesday, April 30, 2024

అస‌లు పుష్ప ఎక్క‌డ‌.. ర‌ష్మిక బ‌ర్త్ డేకి లుక్ రిలీజ్

పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప‌2 తెర‌కెక్కుతోంది.ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..హీరోయిన్ ర‌ష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్నారు. మలయాళ స్టార్ యాక్టర్‌ ఫహద్‌ ఫాసిల్‌, సునీల్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ సీక్వెల్‌కు కూడా సంగీతం అందిస్తున్నారు. స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ముందుగా ప్రకటించిన ప్రకారం స్టన్నింగ్ అప్‌డేట్‌ను అందించారు. పుష్పరాజ్‌ ఎక్కడ.. సెర్చ్‌ త్వరలోనే ముగుస్తుంది.. రూలింగ్‌కు ముందు పుష్పరాజ్‌ వేట.. ఏప్రిల్‌ 7న సాయంత్రం 4:05 గంటలకు అదేంటో చెప్పబోతున్నాం.. అని స్టన్నింగ్‌ అప్‌డేట్ వీడియోను షేర్ చేశారు. అల్లు అర్జున్‌ బైక్‌పై సూపర్ ఫాస్ట్‌గా పారిపోతున్న విజువల్స్‌తో షురూ అయిన ఈ వీడియో.. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ.. అనే డైలాగ్స్‌తో సస్పెన్స్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. మరోవైపు ఏప్రిల్ 5న హీరోయిన్ ర‌ష్మిక మంద‌న పుట్టినరోజు.. ఈ సంద‌ర్భంగా అందమైన శ్రీవల్లి కి పుష్ప.. ది రూల్‌ టీం శుభాకాంక్షలు తెలియజేస్తూ విడుదల చేసిన లుక్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement