Tuesday, September 19, 2023

టెన్త్ హిందీ పేప‌ర్ లీకేజ్ – అదంతా బిజెపి కుట్ర‌…

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: పదవ తరగతి హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. హన్మకొండ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్‌ పాఠశాల పరీక్షా కేంద్రం నుంచి ఈ పేపర్‌ బయటకు వచ్చినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. అయితే, వికారాబాద్‌ జిల్లా తాండూరులో పరీక్షల ప్రారంభం రోజునే తెలుగు పేపర్‌ లీక్‌ కావడం, వరుసగా రెండోరోజు మంగళవారం హిందీ పేపర్‌ బయటకు రావడం సంచల నంగా మారింది. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని రాజకీయ శక్తులు ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రశ్నాపత్రాల లీక్‌ వెనుక విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారం వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రమేయం ఉందని మరో మంత్రి తలసాని శ్రీనావాస్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. కాగా, వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ, పరీక్షా విధానం లోపాలున్నాయని ఎత్తి చూపేందుకే హిందీ పేపర్‌ను లీక్‌ చేసినట్లుగా అనుమానిస్తున్నామని ప్రకటించడం గమనార్హం. పేపర్‌ను లీక్‌ చేసిన నిందితుడు మొదటి గంటలోనే బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌తో సహా 140 మందికి వాట్సాప్‌ ద్వారా పంపించారని చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది.

- Advertisement -
   


పేపర్‌ లీక్‌ జరిగిందిలా..
కమలాపూర్‌కు చెందిన పదహారేళ్ళ మైనర్‌ బాలుడు తన మిత్రుడి కోసం కమలాపూర్‌ పాఠశాలలోని ప్రహరి గోడ పక్కనే ఉన్న చెట్టు ఎక్కి దానిద్వారా పాఠశాల మొదటి అంతస్తులోని మూడవ తరగతి గదిలోకి ప్రవేశించాడు. కిటికి వద్ద పరీక్ష రాస్తున్న ఓ విద్యార్ది వద్ద నుంచి ఉదయం 9.45 గంటలకు ప్రశ్నపత్రాలను లాక్కొని తన సెల్‌ఫోన్‌లో ఫొటో తీసుకున్నాడు, ఆ వెంటనే తన వాట్సఫ్‌ గ్రూపుల్లో షేర్‌ చేశాడు. ఈ ప్రశ్నపత్రం పొటోను మరో నిందితుడిగా భావిస్తున్న మౌటం శివగణష్‌ ఉదయం 9.59 నిమిషాలకు తన ఫోన్‌ ద్వారా ఎస్సెస్సీ 2019-20 అనే వాట్సఫ్‌ గ్రూపులో ఫార్వర్డ్‌ చేయగా, మూడవ నిందితుడుగా ఉన్న ప్రశాంత్‌ అనే మాజీ విలేకరి ఈ గ్రూపు నుంచి వచ్చిన ప్రశ్నపత్రాలను వివిధ వాట్సఫ్‌ గ్రూపుల్లోకి ఫార్వడ్‌ చేయడం వల్ల వైరల్‌గా మారింది. ప్రశాంత్‌ రాష్ట్ర మీడియాతో పాటు బండి సంజయ్‌కు ప్రశ్నప త్రాలను పంపించినట్లు పోలీసులు గుర్తించా రు. ప్రశ్నాపత్రం ఉదయం 9.30 గంటలకే లీక్‌ అయిందని, ఇంకా పరీక్ష జరుగుతూనే ఉందంటూ వాట్సఫ్‌ గ్రూపుల్లో పోస్ట్‌లో పేర్కొన్నట్లు ప్రకటించారు. ప్రశాంత్‌ అనే నిందితు డు రెండు గంటల వ్యవధిలో 142 ఫోన్స్‌ కాల్స్‌ మాట్లాడి నట్లుగా తేలింది. అక్కడి నుంచి కాకతీయ మెడికల్‌ కాలేజీ లో పనిచేస్తున్న మహేష్‌కు ఈ ప్రశ్నాపత్రం చేరింది.


పరీక్షా కేంద్రం పరిశీలకులు, ఇన్విజిలేటర్లపై చర్యలకు సిఫారసు
కమలాపూర్‌ పాఠశాలలో పరీక్ష కేంద్రంలో పరీక్షలను పర్యవేక్షిస్తున్న పర్యవేక్షకులతో పాటు ఇన్విజిలేటర్లపై చర్యలపై విద్యాశాఖ అధికారులకు సిఫారస్సు చేస్తున్నట్లు సీపీ రంగనాథ్‌ వివరించారు. అదే విధంగా పాఠశాల వద్ద రక్షణ బాధ్యత నిర్వర్తిస్తున్న పోలీస్‌ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోనున్నట్లు సీపీ వివరించారు. పరీక్షపేపర్లను కాపీ యింగ్‌ చేసిన మైనర్‌ బాలుడ్నీ జువౖౖెనల్‌ హోమ్‌కు తరలి స్తున్నామి, మిగత ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ వివరించారు.

పూర్తిస్థాయిలో కేసు విచారణ..
ప్రశ్నాపత్రం కాపీయింగ్‌ వ్యవహరంలో పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు సీపీ రంగనాథ్‌ తెలిపారు. పేపర్‌ పాఠశాల నుంచి లీకేజీ వ్యవహారంలో పర్యవేక్షకులు, ఇన్విజిలెటర్ల పాత్ర ఏమేరకు ఉన్నది. ఇతర సిబ్బంది పాత్ర ఏమేరకు ఉన్నద నే కోణంలో విచారణ చేస్తున్నామని, అదేవి ధంగా అక్కడ రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీసులపై కూడా విచారణ చేస్తున్నట్లు సీపీ తెలిపారు. ప్రశాంత్‌ అనే నిందితుడు రెండు గంటల వ్వధిలో 142 కాల్స్‌ మాట్లాడారని ఎవరెవరితో ఏమి మాట్లాడారని వివరాలు కూడా విచారణ చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్థానిక పాఠశాల వాట్సఫ్‌ గ్రూప్‌ అడ్మీన్‌తో పాటు అందులో ఎవరెవరూ ఉన్నారు..ఎవరెవరూనంబర్ల ద్వారా ఏఏ వాట్సఫ్‌ గ్రూపుల్లోకి వెళ్లిందనే వివరాలను కూడా విచారణ కొనసాగిస్తున్నామని సీపీ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement