Friday, May 3, 2024

త్రివిక్రమ్ పవన్ ‘కోబలి’ స్టార్ట్ అయ్యేది ఎప్పుడో ?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కాల్సిన చిత్రం కోబలి. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కబోయే ఈ సినిమా కు గతంలో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇది ముందుకి కదలలేదు. ఆ ప్లేస్ లో అజ్ఞాతవాసి సినిమా వచ్చింది. ఆ తర్వాత అరవింద సమేత సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా గడిపారు. అయితే ఇప్పుడు పవన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే కోబలి ని తిరిగి తెరకెక్కించేందుకు త్రివిక్రమ్, పవన్ ఆసక్తి చూపిస్తున్నాడట.

ప్రస్తుతం త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్రాజెక్ట్ కు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ రీమేక్ తో పాటు అలాగే కొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement