Thursday, May 2, 2024

రకుల్ ట్వీట్ వెనుక అర్థం ఏమిటి ?

మొన్నటి వరకు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలు మినహా పెద్దగా అవకాశాలు లేవు. అయితే రకుల్ ప్రీత్ ఇప్పుడు కొత్తగా ట్రై చేయబోతోందా అంటే అవుననే అంటున్నారు నెటిజన్స్. రకుల్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్ లో ఏముందంటే కడుపు నొప్పెట్టెదాక నవ్వండి. ఆ తర్వాత మరికాస్త నవ్వండి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో మెసేజ్ పోస్ట్ చేసిన ఈ అమ్మడు… ఒక ఫోటో ని కూడా పోస్ట్ చేసింది. సిరీస్ కమింగ్ సూన్ అంటూ హ్యాష్ ట్యాగ్ చేసింది. ఇంతకీ దీని అర్థం ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఇప్పటికే కాజల్, తమన్నా, సమంత వంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఇప్పుడు రకుల్ కూడా అదే మార్గం లో అడుగులు వేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement