Friday, May 17, 2024

ఒక్క ఆవు పాలతో లక్ష రూపాయలు

సాధారణంగా ఆవు రోజుకు 10 నుంచి 20 లీటర్లు పాలు మాత్రమే ఇస్తాయి. కానీ హర్యానాలో ఓ ఆవు మాత్రం ఏకంగా 65 లీటర్లు ఇస్తోంది. హర్యానాలోని కర్నాల్​ జిల్లాలో దాదుపుర్​ గ్రామానికి చెందిన కుల్​దీప్​ సింగ్​ దగ్గర ఉన్న ఆవు.. ఎండీవర్​ రకానికి చెందింది. ఈ గోవు దేశీయ రకం కాదు. దీనిని పోలాండ్​ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ ఆవు రోజుకు 65 లీటర్ల పాలు ఇస్తోంది. ఈ ఆవు నుంచి ప్రతి మూడు గంటలకు ఓసారి పాలు పితుకుతారు. దీని యజమాని కేవలం ఈ ఒక్క ఆవు పాలతో నెలకు లక్ష రూపాయలకుపైగా సంపాదిస్తున్నారు. అంతేగాకుండా పాలు ఎక్కువ ఇచ్చే గోవుల పోటీల్లో పాల్గొని.. యజమానికి కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ ఆవుకు యాజమాని కుల్ దీప్ సింగ్ భారీగానే ఖర్చు చేస్తున్నారు. రోజుకు సుమారు రూ.600 నుంచి రూ.800 వరకు వెచ్చిస్తున్నారు. 35 కిలోల సైలేజ్​ గడ్డి, 20 కిలోల పచ్చిమేత,12 కిలోల ధాన్యపు పొట్టును మేతగా వేస్తారు. రోజుకు కనీసం నాలుగు సార్లు స్నానం చేయిస్తారు. ఈ గోవు మరో బిడ్డకు జన్మనిస్తే ఈసారి రోజుకు 100 లీటర్ల వరకు ఇస్తుందని యజమాని కుల్​దీప్ సింగ్​ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement