Monday, April 29, 2024

లిటిల్ మెగా ప్రిన్సెస్ కి వెల్ క‌మ్.. మెగాస్టార్ చిరంజీవి

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాసన నేడు పండంటి ఆడ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చారు. దాంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.కాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత అయ్యారు. దాంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. తనకు మనవరాలు పుట్టిన ఆనందాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. లిటిల్ మెగా ప్రిన్సెస్ కి స్వాగతం అంటూ చిరు ట్వీట్ చేశారు. హార్ట్ సింబల్స్ తో తన మనవరాలిపై ప్రేమను కురిపించారు. నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీ రాక ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement