Wednesday, May 8, 2024

కామెడీ ట‌చ్ తో.. అర్థ‌మ‌య్యిందా అరుణ్ కుమార్

తెలుగు ఓటీటీ ఆహాలో ప‌లు షోల‌తో పాటు.. ప‌లు వెబ్ సిరీస్ లు కూడా నిర్మిత‌మ‌వుతున్నాయి. కాగా రీసెంట్ గా ‘ఆహాస రిలీజ్ చేసిన సత్తిగాని రెండెకరాలు వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక త్వరలో మరో వెబ్ సిరీస్ ను వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ వెబ్ సిరీస్ పేరే అర్థమయ్యిందా అరుణ్ కుమార్.జోనాథన్ ఎడ్వర్డ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కి, ఈ రోజునే టైటిల్ ను ఖరారు చేసి .. ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అమలాపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ సంస్థలో చేరతాడు. అక్కడి మనుషులు .. వాళ్ల మనస్తత్వాలు .. జరిగే రాజకీయాలు చూసి ఎలా స్పందిస్తాడు? ఏం చేస్తాడు? అనేది కథ. హర్షిత్ రెడ్డి .. అనన్య శర్మ .. తేజస్వి మదివాడ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి పరిస్థితి ఎలా ఉంటుందనడానికి నిదర్శనంగా ఈ పోస్టర్ కనిపిస్తోంది. కామెడీ టచ్ తో ఈ వెబ్ సిరీస్ నడుస్తుందనే విషయం అర్థమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement