Saturday, April 20, 2024

విద్య‌తోనే ఉజ్వల భవిష్యత్తు : ట్రైనీ కలెక్టర్

నేరడిగొండ : సమాజంలో విద్య‌ ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ కలెక్టర్ శ్రీజ అన్నారు. కలెక్టర్ శిక్షణలో భాగంగా వయోజన విద్య‌ ద్వారా నిరక్షరాస్యులను అక్ష‌రాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేసిన గ్రామాల్లో మండలంలోని కుంటాల కె.గ్రామాన్ని బుధవారం సందర్శించి వయోజన విద్య‌పై పరిశీలించారు. గ్రామ ప్రజల్లో ఎంతమంది విద్య నేర్చుకుంటున్నారు అనే దానిపై ఆరా తీశారు. ఎంత మంది మహిళలు, పురుషులు విద్య‌ నేర్చుకుంటున్నరని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతిఒక్కరు విద్య‌ నేర్చుకోవాలన్నారు సమాజంలో వంద శాతం నిరక్షరాస్యత తొలిగిపోవాలని సూచించారు. చదువు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కనీసం చదవడం రాయడం నేర్చుకోవాలన్నారు. ఆమె వెంట స్థానిక సర్పంచ్ ఏపీఎం ఉత్తమ్, సీసీ కవిత, ఐసీడీఎస్ మండల సూప‌ర్వైజ‌ర్ మంజుల, అంగన్వాడీ టీచర్, గ్రామస్తులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement