Sunday, April 28, 2024

ఊరుపేరు భైర‌వ‌కోన‌.. సందీప్ కిష‌న్ కి హిట్ ఇస్తుందా

ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా.. ఒక్క‌క్ష‌ణం లాంటి సినిమాలు తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు వీఐ ఆనంద్. అలాంటి వీఐ ఆనంద్ మరో ఇంట్రెస్టింగ్ లైన్ తో ‘ఊరుపేరు భైరవకోన’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి రెడీ అవుతున్నాడు. రీసెంట్ గా వదిలిన టీజర్ ద్వారా ఇది గరుడపురాణంతో ముడిపడిన కథ అని తెలుస్తోంది. ‘కృష్ణదేవరాయల కాలంలోని గరుడపురాణానికీ .. ఇప్పటి గరుడ పురాణానికి నాలుగు పేజీలు తగ్గాయి’ అంటూ ఆ నాలుగు పేజీల్లో ఏముందనే ఒక ఆసక్తిని పెంచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.అప్పటి గరుడపురాణంలోని ఆ నాలుగు పేజీలు ఎలా మిస్సయ్యాయి? ఆ నాలుగు పేజీలతో ‘భైరవకోన’కి ఉన్న సంబంధం ఏమిటనేది కథ. టీజర్ తరువాత సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నైట్ ఎఫెక్ట్ సీన్స్ సినిమాపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. గత కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న సందీప్ కిషన్ కి, ఈ సినిమాతో హిట్ పడటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement