Thursday, May 2, 2024

చావుకి ఎదురెళ్లే ద‌మ్ముందా.. ఆస‌క్తిక‌రంగా విరూపాక్ష ట్రైల‌ర్

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. సాయితేజ్ కి జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది.ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుండి ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గ్రహణం విడిచేలోగా ఊరు అంతమైపోతుంది .. జరుగుతున్న చావులకు కారణం తెలుసుకుని తీరతాను’ .. ‘ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా’ అనే డైలాగ్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి.. కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. అడవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గిరిజన గూడెం నేపథ్యంలో నడిచే కథ ఇది. బీవీఎస్ ఎన్ కుమార్ – సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement