Monday, April 29, 2024

శాంతి కోరుకున్న శ్రీవ్యాస మహర్షి!

తమేవ శరణం గచ్ఛ సర్వ భావేన భారత? తత్ప్రసాదాత్‌ పరాం శాంతిం? స్థానం ప్రాప్స్యసి శాశ్వతం?
(భగవద్గీత అ 18 శ్లొ62)
”ఓ భారతా! అన్ని విధములుగా ఆ పరమేశ్వరునే శరణుజొచ్చుము. అతని కృప చేతనే పర మశాంతిని, శాశ్వతమైన పరమ పదాన్ని పొందగలవు” (18-62) అని శ్రీ వ్యాసదేవుల వారు భగవద్గీత ద్వారా మానవాళికి అభయాన్నిచ్చి ఆశీర్వదించారు.
సర్వమునకు మూలమైన పరమా త్మ సమస్త ప్రాణులకు, లోకములకు, లోకేశ్వరులకు అధిపతి. సమస్త ప్రాణు లకు ఆత్మీయుడు, అవ్యాజ దయాళు వు. పరమ ప్రేమ స్వరూపుడు, పవిత్రు డు, శుభములనిచ్చువాడు, శాంతిస్వ రూపుడు, శాంతియే ఆ తండ్రి సహజ స్థి తి. ఆ తండ్రి బిడ్డగా అట్టి సహజ స్థితిని పొంది, శాంతి స్వరూపుడైన ఆ తండ్రిని చేరటమే మనిషి పరమ లక్ష్యం. అంటే ప్రతి మనిషి జీవి త లక్ష్యమూ తాను శాంతిగా ఉండాలన్నదే. మనిషికి ఆనందాన్ని కలిగించేది మనశ్శాంతి మా త్రమే! భగవానుడు భగవద్గీతలో సాంఖ్య యోగంలో 26-6 శ్లోకం బోధిస్తూ ఇలా చెప్పారు.
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా? న చాభావయత: శాంతి: అశాంతస్య కుత: సుఖమ్‌? (భగవద్గీత అ 2 శ్లొ66)
ఇంద్రియములు, మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంత:కరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భా వనాహనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వారికి సుఖము ఎట్లు లభించును? అని ప్రశ్నిస్తున్నారు పరమాత్మ. శాంతికి, అశాంతికి నెలవు మనసే! మనోమాలిన్యాన్ని తొల గించుకొని నిర్మలత్వాన్ని పొందే మార్గాలలోనూ, ప్రక్రియలనెన్నిటినో శ్రీ వ్యాసుల వారు తమ గ్రంథముల ద్వారా తెలి య చేశారు.
సనాతన ధర్మంలో ఎలాంటి దైవకార్యం చేసినా, శాంతి మంత్రాలతో ముగిస్తారు. ఇది అనాది నుంచి ఉన్న విధానం. అందుకు కారణం ప్రకృతిలోని ఓషధులు (వనస్పతులు), పంచ భూతాలు, గిరులు, సిరులు, పంటనిచ్చే నదులు- నిత్యమూ అనేక కాలుష్యాల బారినపడుతుం టాయి. మంత్రాలు భావమయ ప్రకంపనలు. ఆచరణకు ప్రేరణలు. ఆకాంక్షలూ అంతే. ‘లోకా స్సమస్తా సుఖినోభవంతు’, ‘సర్వేజనా స్సుఖినో భవంతు’- వీటిని పెదవుల నుంచి గాక మన స్ఫూర్తిగా పలికితే, ప్రకృతి శక్తులు పరిశుద్ధమై ప్రసన్నమవుతాయన్నది పెద్దల మాట. ఈ భావన ఆచరణ రూపం దాల్చిన నాడు అందరూ ప్రకృతికి మిత్రులే, శాంతి దూతలే. ‘అందరూ బాగుండాలి’ అని నిజాయితీగా కోరుకునే వ్యక్తి ఎవరికీ అపకారం చెయ్యలేడు. చేతనైనంత మేరకు ఉపకారమే చేస్తాడు. నిర్మలుడవుతాడు. వాతావరణ కాలుష్యాన్ని, వ్యక్తులలో కలిగే కాలుష్యాన్ని (మానసిక ఆందోళన, అశాంతి మొదలైనవి) నిర్మూలించి ప్రశాంతతను, శాంతిని పొందుటకు కూర్చిన పద సముదాయమే శాంతి మంత్రములు. వేదమంత్రాలన్నీ ‘ఓం శాంతి: శాంతి: శాంతి:’ అంటూ ముగుస్తాయి. మూడుసార్లు శాంతి అనటానికి మనిషి త్రివిధ తాపాల నుండి బయటపడి శాంతిని పొందాలన్న భావన. అట్టి శాంతి మంత్రాలనెన్నింటినో వేదం మన కు అందించింది.
మహాభారతంలో తన తల్లి సత్యవతికి, ధృతరాష్ట్రునికి, గాంధారికి, కుంతికి, పాండవుల కు, ద్రౌపదికి, ద్రుపద మహారాజుకు, ఉత్తరకు, యుద్ధంలో చనిపోయిన వీరుల బంధువులకు, పరీక్షిన్మహారాజుకు ఇలా ఎందరికో అనేక సందర్భాలలో శాంతిని ప్రసాదించారు శాంతియే తన స్వరూపంగా కలిగి తన బిడ్డలందరూ కూడా శాంతిగా, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు వ్యాసభగవానులు. మహాభారతంలో ఏకంగా ‘శాంతిపర్వం’ పేరుతో ఒక పర్వాన్ని సృష్టించి శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో భీష్మ యుధిష్ఠిర సంవాదంగా ధర్మాలను, సత్యాన్ని, శాంతిని అందించే బోధలు చేయించారు. ఈ పర్వం ప్రాజ్ఞులకు చాలా ఇష్టమైనది.
శాశ్వతమైన పరమ శాంతి, ఆత్మసుఖం శ్రీమద్భగవద్గీత ద్వారా అనుభవము అయ్యేలా జ్ఞానామృతాన్ని ప్రసాదించారు శ్రీ వ్యాసభగవానులు. భరతావని శాంతిసౌఖ్యాలతో వర్థిల్లాలని కోరుకున్న శాంత స్వరూపులు శ్రీవ్యాస భగవానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement