Tuesday, May 21, 2024

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ విలన్ ఇతనే ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే తన 31 వ చిత్రం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవల విడుదల చేశారు. ఇక ఈ చిత్రంలో విలన్ రొల్ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియ రావట్లేదు.

ఈ సినిమాలో విలన్ గా విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని అనుకుంటున్నారట. ఇక విజయ్ సేతుపతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలే మాస్టర్ ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ఇరగదీశాడు. ఇక పోతే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కే జి ఎఫ్ 2 సినిమా తో పాటు సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండూ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement