Monday, May 6, 2024

సౌత్ లో విజయ్ దేవరకొండకే ఆ రికార్డ్ సొంతం

పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే మాస్ ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో పెరిగింది విజయ్ దేవరకొండకి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండకు ఇంస్టాగ్రామ్ లో ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగింది.

ఏకంగా 12 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఘనతను ఫాస్ట్ గా అందుకున్న మొట్టమొదటి దక్షిణాది హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేశాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదల అయిన లుక్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement