Wednesday, April 24, 2024

అమెజాన్ చేతికి ప్రముఖ హాలీవుడ్ సంస్థ

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అనేక సూపర్‌హిట్‌ హాలీవుడ్‌ సినిమాలు నిర్మించిన మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ (ఎంజీఎం) మూవీ స్డూడియోస్‌ను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎంజీఎం స్టూడియోస్‌ను సొంతం చేసుకునేందుకు అమెజాన్‌ దాదాపు 9 బిలియన్‌ డాలర్లు వెచ్చించనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ డీల్ గురించి మాట్లాడేందుకు ఇరు సంస్థలు నిరాకరించాయి.

ప్రస్తుతం ఎంజీఎం స్టూడియోస్‌కు ఎంజీఎం హోల్డింగ్స్ సంస్థ యజమానిగా ఉంది. గత ఏడాది చివరి నుంచి ఎంజీఎం స్టూడియోస్‌ను ఈ సంస్థ విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ ఈ డీల్ నిజమైతే.. ఎంజీఎం స్టూడియోస్ చేతిలో ఉన్న జేమ్స్‌బాండ్‌ సినిమాలతో పాటు అనేక సూపర్‌ డూపర్‌ హిట్‌ హాలీవుడ్‌ సినిమాలు అమెజాన్‌ పరమవుతాయి. గత 100 ఏళ్లలో ఎంజీఎం స్టూడియోస్‌ భారీ చిత్రాలతో పాటు ఎన్నో టెలివిజన్‌ షోలను నిర్మించింది. ఇవి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్‌కు మరింత బలాన్ని చేకూరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement