Tuesday, April 30, 2024

ఓటీటీ బాటపట్టిన ‘విడుతలై’.. త్వరలోనే రిలీజ్ డేట్

తమిళ డైరెక్టర్ వెట్రిమాన్ దర్శకత్వం వహించిన ‘విడుతలై’ సినిమాతో హీరోగా మారాడు తమిళ కమిడియన్ సూరి. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులని విశేశంగా ఆకట్టుకుని, సినీ విష్లేశకులనుంచి సైతం మంచి రివ్యూలను సంపాదించుకుంది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించాడు.

అయితే, ఈ సూపర్ సెన్షనల్ మూవీ త్వరలో ఓటీటీ బాట పట్టనున్నటు సినీ సర్కిల్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సినిమా మరో నెల రోజుల్లో ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అయితే, విడుతలై సినిమా తెలుగు డబ్డ్ వర్షెన్ ఈ నెల (ఏప్రిల్) 7న థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు సమాచారం. అయితే, ఈ సినిమా తెలుగు రిలీజ్ పై అధికారిక ప్రఖటన రాలేదు. ఈ వార్తలపై త్వరలో అధికారికంగా అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement