Thursday, May 16, 2024

IPL |గుజ‌రాత్‌, ఢిల్లీ మ్యాచ్.. పృథ్వీషా అవుట్​​

ఐపీఎల్ 7వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్, గుజ‌రాత్ టైట‌న్స్ త‌ల‌ప‌డుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్​ జరుగుతోంది. సీజ‌న్ ఆరంభ పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ఓడించిన హార్దిక్ పాండ్యా సేన రెండో విజ‌యంపై క‌న్నేసింది. గ‌త మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో కంగుతిన్న ఢిల్లీ సొంత గ్రౌండ్‌లో గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. తొలి మ్యాచ్‌కు దూర‌మైన గుజ‌రాత్ టైటన్స్ విధ్వంస‌క బ్యాట‌ర్ డేవిడ్ మిల్ల‌ర్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ పేస‌ర్ అన్రిచ్ నార్ట్జ్ జ‌ట్టుతో క‌లిశారు.

ఇక‌.. తొలి ఓవ‌ర్‌లోనే 11 ప‌రుగుల‌ను రాబ‌ట్టింది ఢిల్లీ.. గుజ‌రాత్ బౌల‌ర్ ష‌మీ వైడ్ బాల్స్‌, ఎక్స్‌ట్రాలు వేశాడు. రెండో ఓవ‌ర్లో 9 ప‌రుగులు రాబ‌ట్టి మొత్తం రెండు ఓవ‌ర్ల‌లో 20 ప‌రుగులు చేసింది ఢిల్లీ టీమ్‌.. ఓపెన‌ర్లుగా డేవిడ్ వార్న‌ర్‌, పృథ్వీషా ఆడుతున్నారు. కాగా, రెండో ఓవర్​లో పృథ్వీషా (7) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement