Saturday, April 27, 2024

Hyd | కేబుల్​ బ్రిడ్జికి మరమ్మతులు.. మూడు రోజులపాటు రాకపోకలు బంద్​!

హైదరాబాద్​లోని ఐకానిక్​ సెంటర్​ అయిన దుర్గంచెరువు కేబుల్​ బ్రిడ్జి నిర్వహణ పనులు జరగనున్నాయి. దీనికోసం మూడు రోజులపాటు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపేయనున్నట్టు జీహెచ్​ఎంసీ తెలిపింది. కేబుల్​ బ్రిడ్జి పనులు, స్టే కేబుల్​ సిస్టమ్​లో కొన్ని తనిఖీలను చేపట్టాలని గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (జీహెచ్​ఎంసీ) నిర్ణయించింది. ఈ క్రమంలో బ్రిడ్జిపై 100 టన్నుల అతిపెద్ద క్రేన్​లతో పనులు జరగనున్నాయి. కేబుల్​ బ్రిడ్జి పైలాన్​ P1, P2 వద్ద తనిఖీ చేపట్టాల్సిన అవసరం ఉన్నందున క్రేన్‌లు క్యారేజ్‌వేను పూర్తిగా ఆక్రమిస్తాయి. అందుకని వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడనుంది.

కాగా, ఈ దారిలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఏప్రిల్ 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ రూట్లలో ట్రాఫిక్ డైవర్షన్​ చేపట్టనున్నట్టు వెల్లడించారు..

  1. రోడ్ నంబర్ 45 నుండి కేబుల్ బ్రిడ్జ్ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వద్ద రోడ్డు నెం 45లోకి మళ్లిస్తారు. అక్కడే – కుడి మలుపు – మాదాపూర్ L&O PS వైపు – ఎడమ మలుపు – COD జంక్షన్ – సైబర్ టవర్లు -, ఎడమ మలుపు – నిమ్మ చెట్టు జంక్షన్ – IKEA రోటరీ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  2. రోడ్ నెం 45 నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ రోడ్డు నెం.45లోని డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ వద్ద మళ్లించనున్నారు. – కుడి మలుపు – డి-మార్ట్ ముందు, ఎడమ మలుపు – వసంత్ ఎంబ్రాల్డ్ గార్డెన్స్, – ఎడమ మలుపు – HMWSSB -, కుడి మలుపు – నెక్టార్ గార్డెన్ రోడ్డు. – సంప్రదాయ, ఎడమ మలుపు, నెక్టార్ గార్డెన్ కాలనీ.. కుడి మలుపు నెక్టార్ గార్డెన్ జంక్షన్ – లెఫ్ట్ టర్న్ – దుర్గం చెరువు – I ల్యాబ్స్ U-టర్న్ – ITC కోహినూర్ – మై హోమ్ అబ్రా జంక్షన్ – C గేట్ జంక్షన్ – Ikea రోటరీ – ఎడమ మలుపు – బయో డైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లాలి.
  3. IKEA రోటరీ నుండి కేబుల్ వంతెన మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇన్-ఆర్బిట్ మాల్ – ఎడమ మలుపు – I-ల్యాబ్స్ -, దుర్గం చెరువు, – COD జంక్షన్, – కుడి మలుపు.. – అయ్యప్ప సొసైటీ, – మాదాపూర్ L&O PS, – కావూరి హిల్స్ జంక్షన్, – జూబ్లీహిల్స్ వద్ద మళ్లించనున్నారు.
  4. ఐకియా రోటరీ నుండి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్ ఇన్-ఆర్బిట్ మాల్ – ఎడమ మలుపు – ఐ-ల్యాబ్స్, – దుర్గం చెరువు, – నెక్టర్ గార్డెన్ జంక్షన్ ,- కుడి మలుపు.. – డాక్టర్స్ కాలనీ, – కుడి మలుపు.. – డి – మార్ట్ – యు-టర్న్ వద్ద టర్న్​ చేసుకోవాల్సి ఉంటుంది.

దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రూట్​లో జర్నీ చేసే వాహనదారులు.. ప్రయాణికులందరూ ట్రాఫిక్​ డైవర్షన్​ని పాటించాలని, పోలీసులు సలహాను అనుసరించి ట్రాఫిక్ సజావుగా ఉండేలా సహకరించవలసిందిగా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement