Wednesday, May 8, 2024

వకీల్ సాబ్ కు 10వ స్థానం – నెంబర్ వన్ ప్రభాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అయితే హైదరాబాద్ లో చాలా మంది మాస్ ఆడియన్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సినిమాని చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఒక సినిమా స్టామినా ఏంటో కూడా క్రాస్ రోడ్ లో ఉన్న థియేటర్స్ లో మాత్రమే తెలుస్తుంది. వకీల్ సాబ్ విషయానికి వస్తే పదో స్థానంలో నిలిచింది. క్రాస్ రోడ్స్ లో తొలి వారం వసూళ్ళలో ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 ఉండగా1,66,17,811 రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాకు దరిదాపుల్లో మరే సినిమా లేదు.

ఆ తర్వాత 1,16,39,781రూపాయలతో ప్రభాస్ నటించిన సాహో రెండో స్థానంలో నిలిచింది. మహేశ్స రిలేరు నీకెవ్వరు సినిమా 1,04,59,230 రూపాయలతో మూడో స్థానంలో నిలిచింది. అల్లు అర్జున్అల వైకుంఠపురములో 92,95,797తో నాలుగో స్థానంలో దక్కించుకుంది. ఐదో స్థానం లో 92,12,430 రూపాయలతో తో మహేశ్మహర్షి నిలిచింది. ఆరో స్థానంలో ప్రభాస్ నటించిన బాహుబలి1 91,17,904 రూపాయలు వసూలు చేసింది.

ఇక ఏడో స్థానం లో 89,76,555 రూపాయలతో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం నిలిచింది. ఎనిమదవ స్థానంలో 85,12,217 రూపాయలతో రజనీకాంత్ 2.0, 9వ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి సైరా 84,22,065 రూపాయలతో నిలిచింది. పదవ స్థానంలో 83,05,283 రూపాయలతో వకీల్ సాబ్ నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement