Friday, April 26, 2024

కరోనా ఎఫెక్ట్:స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

కరోనా ప్రభావం స్టాక్ మార్కెట్ల పై పడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ… కరోనా ప్రభావంతో మన మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 48,832కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 14,618 వద్ద స్థిరపడింది. హెల్త్ కేర్ సూచీ 1.88 శాతం పెరిగింది. ఏసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ , ఓఎన్జీసీ , మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ గా ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement