Wednesday, May 22, 2024

ఊర్వ‌శి రౌతెల్లా.. మెడ‌లో మొస‌ళ్ల నెక్లెస్

బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతెల్లా మెడ‌లో మొస‌ళ్ల నెక్లెస్ ధ‌రించింది. కాగా కేన్స్‌ రెడ్ కార్పెట్‌పై ఊర్వశి రౌతెల్లా స్టన్నింగ్ లుక్స్‌తో అభిమానులను అలరించింది. పింక్‌ డ్రెస్‌లో దేవకన్యలా మెరిసిపోయింది. ఈ సందర్భంగా ఆమె తన మెడలో ధరించిన మొసళ్ల నెక్లెస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకునే ఆ అందాల భామ ధరించిన నెక్లెస్‌లో ఉన్నది సాధారణ డిజైన్‌ కాదు. గతంలో మనం ఎన్నడూ చూడని ప్రత్యేక డిజైన్‌. బంగారు మొసళ్లతో ఆ నెక్లెస్‌ను డిజైన్‌ చేశారు. రెండు మొసళ్లను మెడలో వేలాడేసుకున్నట్లుగా ఆ నెక్లెస్ ఉంది. ఆ నెక్లెస్‌కు మ్యాచింగ్‌ ఇయర్‌ రింగ్స్‌ను కూడా ఊర్వశి ధరించింది. ఈ ఫెస్టివల్‌కు సంబంధించిన తన ఫొటోలు, వీడియోలను ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement