Monday, April 29, 2024

కిమ్స్‌ హాస్పిటల్స్ తో యూనియన్‌ బ్యాంక్‌ డీల్‌.. ఉద్యోగులకు హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీ

కిమ్‌ హాస్పిటల్స్‌ లిమిటెడ్‌తో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఒప్పందం చేసుకుంది. తమ ఉద్యోగులు, లబ్దిదారులు, రిటైర్‌ ఎంప్లాయీస్‌ ఆరోగ్యపరమైన విషయాలపై దృష్టి సారించేందుకు నిర్ణయించింది. దీని కోసం కిమ్స్‌ ఆస్పత్రితో ఒప్పందం చేసుకున్నట్టు హైదరాబాద్‌ జోన్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫీల్డ్‌ జనరల్‌ మేనేజర్‌ కబీర్‌ భట్టాచార్య తెలిపారు. కిమ్స్‌ హాస్పిటల్స్‌ లిమిటెడ్‌ డీజీఎం నరేష్‌, వంశీ కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు.

అయితే కంపెనీ రెండు రకాల హెల్త్‌ చెకప్‌ ప్యాకేజీలు తీసుకొచ్చిందన్నారు. ఇందులో యూనియన్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌ హెల్త్‌ ప్యాకేజీ, యూనియన్‌ బ్యాంక్‌ జనరల్‌ హెల్త్‌ ప్యాకేజీగా ఉంటాయని ప్రకటించారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ డిప్యూటీ జోనల్‌ హెడ్‌ ఎన్‌వీఎస్‌ యోగానంద్‌తో పాటు హైదరాబాద్‌ ఎఫ్‌జీఎంఓ సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement