Wednesday, May 15, 2024

తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్‌కు ఊరట.. ఏప్రిల్‌ 26 వరకు స్టే విధిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ముందస్తు అనుమతి లేకుండా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించి ఎన్నికల నియమావళిని అతిక్రమించారని పేర్కొంటూ జగన్‌పై 2014లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కావాలని హైదరాబాద్‌ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు జగన్‌కు సమన్లు జారీ చేసింది. వెంటనే విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన జగన్‌ తనపై ఉన్న విచారణను నిలిపివేయాలని కోరారు. అయితే ఈ విచారణను రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్‌ 26 వరకు వాయిదా వేసింది. ప్రజా ప్రతినిధుల కోర్టు హాజరుపై వచ్చే నెల 26 వరకు హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement