Saturday, May 11, 2024

ఫెడ్‌ఎక్స్‌ సీఈఓగా రాజ్‌ సుబ్రమణియం.. ఇండో అమెరికన్‌ ఘనత

భారత్‌ ఖ్యాతీ ప్రపంచం వ్యాప్తం చేసేలా.. మరో ఇండో అమెరికన్‌ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. విదేశీ కంపెనీల్లో భారతీయ నాయకత్వం పెరుగుతూ పోతున్నది. మరో అంతర్జాతీయ సంస్థకు మన భారతీయుడే బాస్‌గా ఎన్నికయ్యాడు. ప్రముఖ కొరియర్‌ సర్వీసుల సంస్థ ఫెడెక్స్‌ను సీఈఓగా రాజ్‌ సుబ్రమణియం సీఈఓగా నియమితులయ్యారు. అమెరికాకు చెందిన మల్టిd నేషనల్‌ కొరియర్‌ డెలివరీ సంస్థ ఫెడ్‌ఎక్స్‌ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రస్తుతం చైర్మన్‌, సీఈఓగా ఉన్న ఫెడ్రిక్‌ డబ్ల్యూ స్మిత్‌ జూన్‌ 1న ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీంతో ఆయన స్థానంలో రాజ్‌ సుబ్రమణియం ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పు తరువాత ఫెడ్రిక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా ఫెడ్రిక్‌ డబ్ల్యూ స్మిత్‌ మాట్లాడుతూ.. భవిష్యత్‌ గురించి తాను ఆలోచించినప్పుడు.. రాజ్‌ సుబ్రమణియం నాయకత్వం ఫెడ్‌ఎక్స్‌కు విజయవంతంగా ముందుకు సాగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. రాజ్‌ సుబ్రమణియన్‌కు ఆ సామర్థ్యం ఉందని స్మిత్‌ అభిప్రాయపడ్డారు. ఫెడ్‌ఎక్స్‌ వ్యవస్థాపకుడు కూడా ఫెడ్రిక్‌ డబ్ల్యూ స్మిత్‌ కావడం గమనార్హం. 1971లో ఈ సంస్థను ఆయన స్థాపించారు.

ఫెడ్రిక్‌ గొప్ప దార్శనికుడు : రాజ్‌

ఈ సందర్భంగా రాజ్‌ సుబ్రమణియన్‌ మాట్లాడుతూ.. ఫెడ్రిక్‌ ఓ గొప్ప దార్శనికతగల నాయకుడు అని, ప్రపంచంలోనే అత్యంత గొప్ప సంస్థను స్థాపించారని కొనియాడారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు తనకు అప్పగించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ హోదాతో తనపై మరింత భారం పెరిగిందని, కంపెనీ సీఈఓగా ఎన్నికవ్వడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా అని తెలిపారు. కంపెనీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఫెడ్‌ఎక్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌ అమెరికాలోని టెన్నెస్సీలో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఫెడ్‌ఎక్స్‌కు సీసీఈఓగా బాధ్యతలు చేపట్టకముందు ఫెడ్‌ఎక్స్‌ ఎక్స్‌ప్రెస్‌ విభాగానికి సుబ్రమణియన్‌ సీఈఓగా ఉన్నారు. దీంతో పాటు ఫెడ్‌ఎక్స్‌ కార్ప్‌ ఉపాధ్యక్షుడిగా, చీఫ్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ ఆఫీసర్‌గా పని చేశారు.

30 ఏళ్ల అపార అనుభవం..

ఫెడ్‌ఎక్స్‌లో ఆయన 1991లో చేరారు. రాజ్‌ సుబ్రమణియం స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన ఐఐటీ బాంబే నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌ పొందిన తరువాత.. మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లోని సిరక్యూస్‌ యూనివర్సిటీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. అంతర్జాతీయ కార్యకలాపాల్లో రాజ్‌కు 30 ఏళ్ల అపారమైన అనుభవం ఉంది. దిగ్గజ సంస్థలైన గూగుల్‌కు పిచాయ్‌, మైక్రోసాఫ్ట్‌కు సత్య నాదెళ్ల, టిటర్‌కు పరాగ్‌ అగరాల్‌ ఇలా.. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలకు మన భారతీయులే సీఈఓలుగా కొనసాగుతున్నారు. తాజా జాబితాలో ఫెడ్‌ఎక్స్‌ సీఈఓగా రాజ్‌ సుబ్రమణియన్‌ చేరారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement