Tuesday, April 30, 2024

‘టక్ జగదీష్’ స్పీడ్ మాములుగా లేదు

శివ నిర్వాణ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టక్ జగదీష్. ఈ సినిమాలో నాని సరసన రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్నుకోరి చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ చిత్రం పై అంచనాలు ఎక్కువయ్యాయి. అలాగే ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఇక ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా టక్ జగదీష్ టీజర్ 16 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. ఇప్పటికే సోషల్ మీడియా లో దూసుకుపోతున్న ఈ టీజర్ మున్ముందు మరిన్ని వ్యూస్ ను సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement