Thursday, May 2, 2024

అన్నాతై కోసం హైదరాబాద్ కు నయన్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అన్నా పై రోబో,పేటా తరువాత రజనీకాంత్ తో సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో ఖుష్బు సుందర్, మీనా, కీర్తి సురేష్ తదితరులు నటిస్తున్నారు. ఇదిలా ఉండగా ఓవైపు కరోనా సెకండ్ వేవ్ తో అన్ని షూటింగులు రద్దు అవుతున్నాయి. కానీ 70 ఏళ్ల వయసులో రజనీకాంత్ మాత్రం చిత్రీకరణలో పాల్గొంటున్నారు.

అయితే తాజాగా అన్నాతై షూటింగ్ లో పాల్గొనేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార హైదరాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం కోవిడ్ నియమనిబంధనల్ని పాటిస్తూనే ఈ ఇరువురు సూపర్ స్టార్లు షూటింగ్ లో పాల్గొననున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement