Tuesday, April 23, 2024

అమెజాన్ లో వకీల్ సాబ్ … డేట్ కూడా వచ్చేసింది

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను కూడా సంపాదించింది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమాకు మరింత క్రేజ్ ను తెచ్చిపెట్టింది.

ఇదిలా కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో చాలా సినిమాలు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా కూడా ఓటీటీ లో రిలీజ్ కాబోతోంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ 26న ఓటీటీ లో విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాను ఏప్రిల్ 30న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఓ వీడియో ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement