Friday, May 3, 2024

Tralala Moving Pictures | కొత్త ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించిన సమంత…

టాలీవుడ్ హీరోయిన్ సమంత నిర్మాతగా కూడా మారబోతున్నారు. మయోసైటిస్ నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటున్న సమంత‌.. ప్రెజెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ తన ఆరోగ్యం పై దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో నటనకు మాత్రమే బ్రేక్ ఇచ్చిన సామ్.. బ్రాండ్ అంబాసడర్‌గా, బిజినెస్ ఉమెన్‌గా మాత్రం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఇక, తాజాగా సమంత నిర్మాతగా మారబోతున్నట్టు.. కొత్తగా ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

- Advertisement -

దీనికి సంబందించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా వేశారు. సమంత తన కొత్త ప్రొడక్షన్ హౌస్ కి ‘త్రాలలా మూవింగ్ పిక్చర్స్’ అనే పేరుని పెట్టారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ లో కొత్త టాలెంట్‌ని, న్యూ ఏజ్ మూవీ మేకర్స్ ని ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మించబోతున్నట్టు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పేర్కోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement