Thursday, May 2, 2024

షంషేరా నుంచి ట్రైల‌ర్ రిలీజ్‌.. వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న ర‌ణ్‌బీర్‌

బాలీవుడ్ ల‌వ‌ర్ బోయ్ రణ్‌బీర్ కపూర్ ఎన్న‌డూ క‌నిపించ‌న‌టువంటి కొత్త లుక్ లో క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్‌లో ఉన్న మూవీ షంషేరా. య‌ష్ రాజ్ ఫిలింస్ ప‌తాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమాకి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే రణ్‌బీర్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు మేక‌ర్స్.. అయితే అభిమానుల్లో మ‌రింత క్యూరియాసిటిని పెంచేందుకు కొద్దిసేప‌టి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో రణ్‌బీర్.. తండ్రీ కొడుకులుగా డ‌బ‌ల్ రోల్ ప్లే చేసిన‌ట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ విలన్ శుద్ధ్ సింగ్ పాత్రను పోషించాడు. సినిమాలో వాణి కపూర్, రణ్‌బీర్‌ల చుట్టూ ల‌వ్ స్టోరీ ర‌న్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక.. ఈ ల‌వ‌ర్ బోయ్‌ సెప్టెంబర్‌లో అయాన్ ముఖర్జీ తెర‌కెక్కించిన బ్రహ్మాస్త్రలో కూడా కనిపించనున్నాడు. షంషేరా, బ్రహ్మాస్త్రతో పాటు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌కత్వంలో యానిమల్, లవ్ రంజన్ మూవీని కూడా లైన్ లో పెట్టాడు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement