Monday, April 29, 2024

టాలీవుడ్ టు బాలీవుడ్…..జగపతిబాబు ఎంట్రీ ఫిక్స్ !!

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న జగపతి బాబు ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమాతో విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో జగ్గూభాయ్ కి వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా తేడా లేకుండా మోస్ట్ వాంటెడ్ మెయిల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నాడు జగపతిబాబు.

అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నట్టు టాక్ నడుస్తోంది. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నుంచి జగపతి బాబుకు ఇప్పటికే పిలుపు వచ్చిందట. అయితే బాలీవుడ్ వర్గాల నడుస్తున్న టాక్ ప్రకారం జగపతిబాబు విలన్ పాత్ర చేయబోతున్నాడని తెలుస్తోంది. కానీ టాలీవుడ్లో మాత్రం హీరో తండ్రి పాత్రకి జగపతిబాబుని సంప్రదించారని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన రావాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement