Wednesday, April 17, 2024

తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం… క్లాసులు ఎప్పుడుంటే…

తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పడితే వచ్చే నెల(జులై)లో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పూర్తిగా తగ్గింది. ప్రతిరోజు రెండు వేల లోపు కేసులే నమోదు అవుతున్నాయి. దీంతో జులై నెలాఖరు వరకు కరోనా తగ్గుతుందని.. స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement