Tuesday, April 30, 2024

Tirumala : సినిమాల‌పైనే నా దృష్టి.. కేసీఆర్ అంటే అభిమానం.. సుమ‌న్

ప్ర‌స్తుతానికి రాజ‌కీయాల గురించి సీరియ‌స్ గా ఆలోచించ‌డం లేద‌ని చెప్పారు సీనియ‌ర్ న‌టుడు సుమన్. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సుమ‌న్. అనంత‌రం ఆలయం బయట ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీ అయ్యింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఐఆర్ఎస్ అయినా ఆత‌ను మద్దతు ఇస్తాన‌ని చెప్పారు సుమ‌న్. సీఎం కేసీఆర్ మీద నాకు అంత అభిమానం ఉంది అని చెప్పారు. తన దృష్టి సినిమాలపైనే అని చెప్పారు. తిరుమల వెళ్లి దండం పెట్టడం తప్ప వెంకటేశ్వరస్వామి మీద నాకు అంత భక్తి ఉండేది కాదు. పెద్దగా కేర్ చేసేవాడిని కాదు. అయితే అన్నమయ్య సినిమాలో ఏడుకొండల వాడి పాత్ర చేసిన తర్వాత నా మీద వెంకన్నకు అంత ప్రేమ, ఇష్టం ఉన్నాయని తెలిసింది. అందుకే ఆయన పాత్రను నేను పోషించే అవకాశం కల్పించార‌ని తెలుసుకున్నాన‌న్నారు. తిరుపతిలో ఉన్న తన అభిమాని నారాయణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement