Sunday, April 28, 2024

బ్రహ్మానందం మూవ్స్ తో తిమ్మరుసు

డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో ముందుంటారు నటుడు సత్యదేవ్. ఇటీవల సత్యదేవ్ శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో సత్య దేవ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయాన్ని తిమ్మరుసు టీం సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. అదేంటంటే కమెడియన్ బ్రహ్మానందం కామెడీ తో పాటు అదిరిపోయే డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు. డాన్స్ లోనూ కామెడీని పండిస్తారు. కాగా బ్రహ్మానందం మూవ్స్ తో సత్యదేవ్ డాన్స్ లు చేస్తున్న వీడియో ను చిత్ర యూనిట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement