Wednesday, May 1, 2024

కొరటాల సినిమా కోసం…ఎన్టీఆర్ వెయిట్ లాస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ యమదొంగ సినిమా కు ముందు ఎన్టీఆర్ ఆ తర్వాత వచ్చిన ఎన్టీఆర్ వేరు. రాఖీ సినిమా లో ఎంతో లావుగా కనిపించిన ఎన్టీఆర్… యమదొంగ లో సన్నగా కనిపించారు.

అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ కోసం మళ్ళీ బరువు గా మారారు ఎన్టీఆర్. కాగా ఇప్పుడు కొరటాల శివ సినిమా కోసం మళ్ళీ బరువు తగ్గుతున్నారట. గతంలో ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. ఇప్పుడు కూడా తరహాలో స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్ ను కొరటాల శివ చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement