Thursday, April 18, 2024

తహసీల్దార్ బెదిరిస్తున్నారంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం

తహసీల్దార్​ బెదిరిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. డబుల్​ బెడ్ ​రూమ్​ ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు వార్డు కౌన్సిలర్, తహసీల్దార్​తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ విజయ్ అనే యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వేకువజామున ఫేస్ ​బుక్​లో లైవ్​పెట్టి పురుగుల మందు తాగాడు.

మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గొడ్రాల విజయ్(30) కారు డ్రైవర్ గా పని చేస్తున్నారు. సొంతిల్లు లేని విజయ్ జిల్లాలోని గుమ్ముడూర్​లోని నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అధికారులు మాత్రం ఇల్లు కేటాయించలేదు. తహసీల్దార్ చుట్టూ తిరిగినా పట్టించుకోవట్లేదు. ఇల్లు ఉన్నోళ్లు, డబ్బులున్నోళ్లకే ఇళ్లు కేటాయిస్తున్నారని, తహసీల్దార్ రంజిత్​కుమార్, వార్డు కౌన్సిలర్ జనార్దన్, మరికొందరితో కలిసి ఇళ్ల కేటాయింపులో అవినీతికి పాల్పడుతున్నారని ఐదు రోజుల క్రితం విజయ్​ ఫేస్ ​బుక్​లో పోస్టు పెట్టాడు. సదురు పోస్టును తొలగించకపోతే చంపేస్తామంటూ బాధితుడు విజయ్ ని తహసీల్దార్ రంజిత్ కుమార్, కౌన్సిలర్ ​జనార్దన్​ ఫోన్ ​చేసి బెదిరించారు. దాంతో విజయ్ ​మంగళవారం వేకువజామున ఫేస్​బుక్​ లైవ్​పెట్టి… పురుగుల మందు తాగి చనిపోతున్నానని విజయ్ ​చెప్పాడు. తహసీల్దార్, వార్డు కౌన్సిలర్​తన చావుకు కారణమని అందులో తెలిపాడు. విషయం తెలుసుకున్న విజయ్ స్నేహితులు అతని వద్దకు వెళ్లి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విజయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement